10th Result: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం విజయవాడలో టెన్త్ ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో మొత్తంగా 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 84.32 శాతం ఉత్తీర్ణతతో బాలికలే పై చేయి సాధించారు. ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతంతో టాప్ ప్లేసులో నిలిచింది. చివరి స్థానంలో కర్నూలు జిల్లా 60 శాతంగా ఉంది. 2300 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. ఒక్కరు పాస్ గాని స్కూల్స్ 17 ఉన్నాయి. మే 24 నుంచి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.
పదో తరగతి పరీక్షలను మార్చి నెల 18వ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.3 లక్షలు కాగా గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3473 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు.