Friday, September 12, 2025

*సుపరిపాలన అందించడానికే ప్రజా పాలన*

* శీలం నర్సయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు.

జనతా న్యూస్ బెజ్జంకి : నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానీకానికి “ప్రజాస్వామ్య ఫలాలు” అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో “ప్రజా పాలన” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు శీలం నర్సయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే అధికార యంత్రాంగం రావడంతో ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అత్యున్నతమైన నిర్ణయం తీసుకుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా పాలన కార్యక్రమంలో ఎన్నికల “మేనిఫెస్టోలో ” ప్రకటించిన 6 గ్యారంటీలతోపాటు ప్రజల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. బెజ్జంకి మండల ప్రజలు ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page