మానకొండూర్ నియోజక వర్గం, జనత న్యూస్
మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని ప్రజా శ్రేయస్సు కొరకు పని చేయాలని తిమ్మాపూర్ మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం తిమ్మాపూర్ లోని ఎల్ఎండి కాలనీలలో గల పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల రమేష్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీగా తమ పార్టీ అభివృద్ధికి సహకరిస్తుందని ఆయన తెలియ జేశారు. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా కాకుండా పార్టీల పార్టీలపరంగా పోరాటాలు చేద్దామని ఆయన హితవు పలికారు. రాజకీయ శత్రుత్వం ఉండాలి తప్ప వ్యక్తిగత శత్రుత్వం పనికిరాదన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై అనుచిత వ్యాఖ్యలకు తెరలేపింది ముందుగా కవ్వం పెళ్లి అని ,కొందరు కాంగ్రెస్ శ్రేణులు వారి స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఇప్పటికైనా మానుకోవాలని ఆయన అన్నారు. కవంపల్లి నోటి దురుసుపై, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కలగజేసుకోవాలని ఆయన కోరారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగానియోజక వర్గ అభివృద్ధి చేసిన రసమయిని వాడు వీడు అని సంబోధించడం ఒక విద్యావేత్త, డాక్టర్అని చెప్పుకొనే కవ్వం పెళ్ళికి ఏ మేరకు సమంజసమని ఆయన ఎదురు ప్రశ్నించారు. నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నేతలు సమయమనంతో ఉన్నారని కాంగ్రెస్ నేతల కారుకూతులకు భయపడేది లేదన్నారు. అనంతరం కొందరు బీ ఆర్ ఎస్ శ్రేణులు సుభాష్ నగర్ స్టేజి వద్ద కవ్వం పల్లి దిష్టి బొమ్మను దహనం చేశారు.