- ఇంటింటి ప్రచారంలో యెముల పుష్పలత.
కరీంనగర్,జనతా న్యూస్ :హుజురాబాద్ నియోజకవర్గం లోని ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతుంది హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా 13వ వార్డు ఇందిరా నగర్ కాలనీలో గడప గడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ… వొడితల ప్రణవ్ గెలుపు తథ్యం అని అన్నారు. సేవ చేయాలని దృక్పథంతో వచ్చిన నాయకుడు వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసే నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాకు ఉన్నందుకు ఎంతో సంతోషమని, కచ్చితంగా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. గడపగడప ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలిసి 6 గ్యారంటీల పథకాలను వివరించి, రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో తెలియజేశారు. ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు