మానకొండూరు ఎమ్మెల్యే హామీ.
జనతా న్యూస్ బెజ్జంకి : నూతన ఎమ్మెల్యే బెజ్జంకి పర్యటనకు వచ్చిన సందర్భంగా మంగళవారం బెజ్జంకి మండల ” ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ “(వి. ఓ. ఏ )లు ఎమ్మెల్యే డాక్టర్ కావ్వంపెల్లి సత్యనారాయణ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సందర్భంగా వివో ఏల సమ్మెలో పాల్గొని తమ ప్రభుత్వం వచ్చాక వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీతక్క తొలి సంతకం వివో ఏ ల గుర్తింపు కార్డుల జారీ ఫైల్ పైన చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా వేతనాల పెంపు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వీరి అన్ని సమస్యలు పరిష్కరిస్తామనిహామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వివోఏ లతోపాటు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ జి.నర్సయ్య, క్లస్టర్ కోఆర్డినేటర్స్ పి.సారయ్య, తిరుపతి, పద్మ, వివో ఏల అధ్యక్షురాలు మంగ మురళి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.