మానకొండూరు నియోజక వర్గం, జనత న్యూస్:
బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అక్కరవేణి పోచయ్య ముదిరాజ్ ను శనివారం ఎంపిక చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి నియామక పత్రం అందించారు.
ఈ సందర్భంగా
అక్కిరవేణి పోచయ్య మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రవాణా శాఖ మంత్రివర్యులు పోన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తోముకుంట నరసారెడ్డి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మరియు బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ముక్కిస రత్నాకర్ రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు . తనపై ఉంచిన బాధ్యతను అకుంఠిత దీక్షతో నిర్వహిస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తనని పార్టీ బలోపేతానికి, పార్టీ పటిష్టతకు తగిన కృషి చేస్తానని తెలియజేస్త నన్నారు.