జనత న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గండికోట సురేష్ ను బెజ్జంకి మండలకాంగ్రెస్ పార్టీ యువ జన శాఖ ఉపాధ్యక్షుడి గా బెజ్జంకి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహంకాళి ప్రవీణ్ నియమిస్తూ నియామాక పత్రాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కావ్వంపల్లి సత్యనారాయణ చేతులు మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గండికోట సురేష్ మాట్లాడుతూ తన నియమాకానికి సహకరించిన బెజ్జంకి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి కీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ కు, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి పోతురెడ్డి రాజశేఖర్ రెడ్డి కి, బెజ్జంకి కాంగ్రెస్ పార్టీ మండల అధికారప్రతినిధి జనగాం శంకర్ కు, బిసి సెల్ మండల అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్ కు ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బర్ల శంకర్, శీలం నర్సయ్య, యువ నాయకులు పోతు రెడ్డి మధుసూదన్ రెడ్డి, వెన్నం రాజు, ఎల హరీష్, పిట్టల అరుణ్, మెరుగు రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా గండికోట సురేష్*
- Advertisment -