Thursday, September 19, 2024

మోగిన ఎన్నికల నగారా… తెలంగాణలో గెలుపు ఎవరిది?

ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల లో ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించింది.దీంతో వివిధ పార్టీలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత రెండు నెలల ముందునుంచే ప్రచార వే డి వూపందుకుంది.టీర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న తెలంగాణ నేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి అందరికన్నా ముందుగా తాను ఎన్నికల కదనరంగలోకి తన బలగాలను సంసిద్ధం చేశారు. ఒక వైపు బీజీపీ,మరో వైపు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రజాక్షేత్రంలోకి దిగారు.అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ఒకటి తర్వాత ఒకటి ప్రకటిస్తూ,ఉన్న పథకాలకు మరింత ఆర్ధిక ప్రయోజనం పెంచుతూ ప్రజలను తనవైపుగా తిప్పుకునే ఎత్తులు వేస్తోంది.పక్క రాష్ట్రంమైన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మంచి వూపులో ఉంది.ఇటీవల హైదరాబాద్ లో విజయభేరీ సభ నిర్వహించి కొంత మేరకు ప్రజలను ఆకర్షించటంలో విజయం సాధించారని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ వ్యాసం రాస్తున్న సమయానికి ఢిల్లీలో సీట్ల కేటాయింపులపై కాంగ్రెస్ నేతల్లో అభిప్రాయభేదాలు మరింతగా భగ్గు మంటు న్నాయి.ఒక దశలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అలిగి వెళ్లినట్లు సమాచారం.మరో వైపు కమలనాథులు కూడా ‘సాలు దొర ఇక సెలవు దొర’ అనే నినాదాలతో జీహెచ్ఎమ్సీ ఎన్నికల నుంచి మంచి వూపు మీద ఉన్నది.దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల గెలుపుతో ఆ పార్టీ బాగా పుంజుకుంది. బీజీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన బండి సంజయ్ మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు.గ్రామీణ ప్రాంతంలో కొంత వరకు వూపు తెచ్చాడనే పేరు ఉంది.ప్రస్తుతం బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సీనియర్ లీడర్ కిషన్ రెడ్డి మెతక వైఖరిగా వుంటూ అధికార బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కో లేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి.అంతే కాకుండా వివిధ పార్టీల నుంచి బీజీపీలో చేరిన నేతలతో కూడా బీజీపీ అధిష్టానానికి తలనొప్పులు ఎదురవుతున్నాయి.ఆధిపత్యం కోసం కూడా నేతలు పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ,సీట్ల కేటాయింపులు,సమీకరణాలు,బుజ్జగింపుల ప్రక్రియతో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.అధికార పక్షం బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్స్ కోసం ఆశావహుల సంఖ్య విపరీతంగా ఉండటం తో ఆసంతృప్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది.అధికార పార్టీ ఎమ్మెల్యే లపై వివిధ నియోజక వర్గాల ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేకత నెలకొంది.అధికార పార్టీ పై నేరుగా విమర్శలు చేయకుండా లోలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.తీరా ఎన్నికల నామినేషన్లు ప్రారంభ సమయానికి 20 శాతం సిట్టింగుల ను మార్చే ఛాన్స్ ఉందని,ఇది కేసీఆర్ వ్యూహంలో భాగమే నాని రాజకీయ విశ్లేషకుల అంచనా.ఏది ఏమైనా తెలంగాణలో రాజకీయాలు నువ్వా నేనా అనే రీతిలో ఉన్నాయి.బీ ఫార్ములు ఇచ్చిన తర్వాత వ్యక్తులపైన గెలుపు ఓటములు ఆధార పడి ఉన్నాయి.అధికార బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ ను,కేసీఆర్ మాటల తూటాల పై ఆధారపడివున్నారు.గెలుపు తమదే అనే ధీమాతో ప్రచారం సాగిస్తున్నారు.ఓటరు మహాశయుడి తీర్పు ఎటు ఉంటదో అందాక వేచి చూద్దాం..

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page