మానకొండూర్ నియోజక వర్గం , జనత న్యూస్
మండల కేంద్రము బెజ్జంకి లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పురుషుల పొదుపు సంఘము సభ్యుడు బొమ్మి డి నరేందర్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం రూ .94,894 నగదు రూపంలో ఆది వారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు బోనగం రమేష్,ఉపాధ్యక్షుడు దూమల మహేష్ పాలకవర్గ సభ్యులు సంగ రవి,వడ్లూరి సాయిలు,బోనగిరి లింగయ్య, బోనగం నర్సయ్య, తాడిచెట్టు భూమయ్య, వడ్లూరి శ్రీనివాస్ అకౌంటెంట్ రవిందర్ పాల్గొన్నారు.