టీటీఎల్‌ఎఫ్ సభ్యత్వ నమోదు
సిరిసిల్ల-జనత న్యూస్:
శాసన మండలిలో ఉపాధ్యాయులు, లెక్చరర్ల సమస్యలపై గళాన్ని వినిపించే నేతకే తమ మద్దతు ఉంటుందన్నారు టీటీఎల్‌ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మాసం రత్నాకర్. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ సంఘం సంయుక్త కార్యదర్శి జగదీశ్వర్‌తో కలసి ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. గత 75 సంవత్సరాలుగా తమ పట్టభద్రుల సమస్యలపై శాసనమండలి గళాన్ని వినిపించిన ఎమ్మెల్సీ ఎవరూ లేరని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ సమస్యలే ఎజెండాగా పనిచేసే నమ్మకమైన అభ్యర్థిని గెలిపించుకునేందుకు కార్యచరణచేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిఎల్‌ఎఫ్ ప్రతినిధులు ట్కూరి రామచంద్రారెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి సుద్దాల మధుసూదన్, వోడ్నాల శేఖర్ బాబు, కాసారపు రామకృష్ణ, శ్రీకాంత్, నవీన్, హరీష్, అయిలి శశి కుమార్, ఆయిలి మహేష్, అడ్వకేట్ పట్టభద్రులు భగత్ రెడ్డి,ఆయిలి నాగరాజు పాల్గొన్నారు.
