బెజ్జంకి,జనతా న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ ఓటమి లక్ష్యంగా నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్ర శుక్రవారం మానకొండూరు నియోజకవర్గం లోని బెజ్జంకి మండల కేంద్రముకు రావడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మానకొండూర్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియమా కాలే, లక్ష్యంగా పోరాడి ఎందరో విద్యార్థుల ప్రాణ త్యాగంతో తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని టీఎస్ పిఎస్ ద్వారా చేపట్టిన ఉద్యోగ నియమాకాలు అన్ని రద్దు కావడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 30న జరిగే ఎన్నికలలో నిరుద్యోగులు కెసిఆర్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శానగోండ శ్రావణ్ కుమార్, సీనియర్ నాయకులు కరీంనగర్ జిల్లా పోరాట సమితి సభ్యులు మానాల రవి, బోనగం రాజేశం గౌడ్, భూతల ఉపేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చక్కెర వేణి పోచయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నారెడ్డి, జెల్ల ప్రభాకర్, మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ధోని వెంకటేశ్వరరావు, చిట్టి రాజు, కోరుకోప్పుల సంపత్ గౌడ్, బుర్ర సుమన్ గౌడ్, తిరుపతి రెడ్డి, మెట్ట నాగరాజు, లింగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
బెజ్జంకిలో నిరుద్యోగ చైతన్య యాత్ర
- Advertisment -