*వివరాలను వెల్లడించిన కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్.
కరీంనగర్, జనతా న్యూస్:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక మార్కెట్ రోడ్డులోని శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో ఏటా నిర్వహించే శ్రీ శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ సారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి వర్యులు కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా వైభవంగా నిర్వహించిన మాదిరిగానే ఈ సంవత్సరం సప్తమ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ తేదీల వివరాలను ఆదివారం దేవాలయంలో ఆలయ కమిటీ సమక్షంలో వివరించారు. ఫిబ్రవరి 11 వ తేదీన అధ్యయనోత్సవాలతో ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 18వ తేదీన శోభాయాత్రతో ముగియనున్నట్లు తెలిపారు కనీవిని ఎరుగని రీతిలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా తన వంతుగా 5 లక్షల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
*ఫిబ్రవరి 11వ తేదీన అధ్యయనోత్సవాలు*
తేది. 12-02-2024 సోమవారం, తదియ “అంకురార్పణ” పుట్టమన్ను తీసుకురావడం. సా॥ 5:00 గం॥లకు విశ్వక్సేస పూజ, పుణ్యాహవాచనం, రక్షబంధనం, అంకురార్పణ, “శేషావాహనసేవ”
తేది. 13-02-2024 మాఘ శు॥ చవితి మంగళవారము ఉ॥ 7:30 ని||లకు యాగశాలలో ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ, ద్వజారోహణ ఉ॥ 9:00 గం॥లకు “సూర్యప్రభ వాహనసేవ” సాయంత్రం 6:00 గం॥లకు బేరి పూజా, నిత్య పూర్ణహుతి, బలిహరణము “చంద్రప్రభ వాహన సేవ”
తేది. 14-02-2024 మాఘ శు॥ పంచమి బుధవారము 10 గం॥లకు “కల్ప వృక్ష వాహన సేవ” సా|| 5:00 గం||లకు ఎదుర్కోళ్ళ ఉత్సవము, అశ్వవాహన, గజవాహన సేవ.
తేది. 15-02-2024 మాఘ శు॥ షష్ఠి గురువారము “శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం” సా॥ 6:00 గం॥లకు “గరుడ వాహన సేవ”
తేది.16-02-2024 మాఘ శు॥ సప్తమి శుక్రవారము ఉ॥ సింహ వాహన సేవ, బలిహరణ, తీర్థప్రసాద గోష్ఠిసా॥ 6:00 గం॥లకు హనుమత్ వాహన సేవ”
తేది.17-02-2024 మాఘ శు॥ అష్టమి శనివారము ఉ॥ మహాపూర్ణాహుతి, చక్ర వసంతోత్సవం. సా॥4:00 గం||ల నుండి “పుష్పయాగం” ద్వాదశారధన, సప్తాప వర్ణములు, ద్వజారోహణ, ఏకాంతసేవ, పండిత సన్మానము.
తేది 18 చివరి రోజున రామ్ నగర్ లోని మార్క్ ఫెడ్ ప్రాంగణం నుండి ఆలయం వరకు శోభా యాత్ర
ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బీ ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, ఆలయ ఈఓ ఉడుతల వెంకన్న, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, గంగాధర్, ఆలయ డైరెక్టర్ పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గందే మహేష్, నేతి రవి వర్మ, దుడ్డెల శ్రీధర్, గంప రమేష్, గోవిందపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.