Saturday, July 5, 2025

క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్యే

మానకొండూర్ నియోజకవర్గం , జనతా న్యూస్

మండల కేంద్రం బెజ్జంకిలో బెజ్జంకి క్రికెట్ ప్రీమియం లీక్ క్రికెట్ పోటీలను మంగళవారం మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత అన్ని రంగాలలో రాణించాలని ముఖ్యంగా విద్యతోపాటుగా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు . బెజ్జంకిలోని స్టేడియంలో పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఆయన ఆవేదన చెందుతూ వాటి నిర్మాణం ఎందుకు ఆలస్యమైందో తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయించగలనని యువతకు హామీ ఇచ్చారు . విద్యా వైద్యంతో పాటుగా క్రీడలు ప్రతి ఒక్కరికి అవసరమేనని క్రీడలు ప్రాథమిక స్థాయి నుండే ప్రారంభించాలని ఆయన కోరారు. గెలుపు ఓటములు సమవుజ్జిగా స్వీకరించి క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యంతో రాణించాలని కోరినారు.

అంతకుముందు మండల కేంద్రం బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ చైర్మన్ బండారి రాములు మరియు సభ్యులు ఆలయ పూజారి శేషం రామాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే విజయం పట్ల బెజ్జంకికి చెందిన బొనగం అంజయ్య గుబిరె  కిషన్ నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాలలో బెజ్జంకి సర్పంచ్ ద్యావనపల్లి మంజులతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఒగ్గు  దామోదర్, ముక్కిస రత్నాకర్, చెప్యాల శ్రీనివాస్, రావుల నరసయ్య బోయినపల్లి చందర్రావు, జ్యోతి, ధోనే వెంకటేశ్వరరావు, మాణాల రవి ,కత్తి రమేష్, అక్కర వేణి పోచయ్య ,రొడ్డ మల్లేశం, పులి కృష్ణ, జేరిపోతుల మధు, లింగాల శ్రీనివాస్, చెన్నారెడ్డి, మహంకాళి ప్రవీణ్, రాజు, పసుల వెంకటి, అంతగిరి వినయ్ కుమార్, ఉపేందర్,మెట్ట నాగరజు  తదితరులు పాల్గొన్నారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page