కరీంనగర్, జనతా న్యూస్ర్: కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా దేవి శెట్టి నవీన్ కుమార్ నియామకంజరిగింది. ఈ మేరకు పట్టణ అధ్యక్షులు నగునూరి రాజేందర్ నియామక పత్రాన్ని నవీన్ కుమార్ కు అందచేశారు. ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి పెద్ది వేణుగోపాల్, కోశాధికారి సుద్దాల వెంకటేష్, సంఘ సభ్యులు కొల్లిపాక శ్రీనివాస్, ఎల్లంకి సంతోష్ చిట్టి మల్ల ప్రశాంత్, పైడా రవి తదితరులు పాల్గొన్నారు. సంఘ పటిష్టత కోసం, అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమంల్లో తన సంపూర్ణ సహాకారం అందించి, ఆర్యవైశ్య జాతికి సామాజికంగా, రాజకీయంగా పెంపొందించుటకు కృషి చేస్తానని ఈ సందర్బంగా నవీన్ కుమార్ తెలిపారు.
కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా దేవి శెట్టి నవీన్ కుమార్ నియామకం
- Advertisment -