ఇల్లంతకుంట డిసెంబర్ 24 జనతా న్యూస్ :
ఎల్లిగడ్డ రేటు చూసి వినియోగదారులు వామ్మో అంటున్నారు కనీవినీ రీతిలో ఎల్లిగడ్డ రేటు కొండెక్కి కూర్చుంది ఒక కిలో ఎల్లిగడ్డ ఇల్లంతకుంట మండలంలోని గ్రామాల్లో 320 రూపాయలకు అమ్ముతున్నారు వంటింట్లో ప్రతిరోజు వాడే వెళ్లి ధర అమాంతం పెరగడంతో కూరల్లో వెల్లుల్లి మహిళలు కొసరి కొసరి వేస్తున్నారు ఇంత రేటు ఎప్పుడు చూడలేదని 20 రోజుల క్రితం ఎల్లిగడ్డ ధర 160 రూపాయలకు కిలో ఉండేదని దీని ధర అమాంతం 360 రూపాయలకు కిలో అవడం పట్ల వినియోగదారులు నో రెల్ల తీస్తున్నారు అదే ఉల్లిగడ్డ 20 రోజుల క్రితం 70 రూపాయలకు కిలో ఉండగా ప్రస్తుతం 100 రూపాయలకు మూడు కిలోలు ఇస్తున్నారు ఎల్లిగడ్డతో పోల్చుకుంటే ఉల్లిగడ్డ రేటు పర్లేదులే అని వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇక అల్లం విషయానికొస్తే 130 రూపాయలకు కిలో చొప్పున ఉంది ఇలా అల్లం ఎల్లిగడ్డ వెల్లుల్లి ధరలు వినియోగదారులను కంగు తినిపిస్తున్నాయి ఎల్లిగడ్డ రేటు ఎంత పెరగడానికి కారణం ఏందబా అని వినియోగదారులు ముక్కున వేలేసుకుంటున్నారు ఎప్పుడైనా ఉల్లిగడ్డ కన్నీరు తెప్పించేది కానీ ఇప్పుడు ఎల్లిగడ్డ కన్నీరు తెప్పిస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. రేటు దిగొస్తుందా లేదా వేచి చూడాలి మరి