కరీంనగర్‌లో కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేలా డిజైన్ చేశారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో మొబైల్ చార్జింగ్, 4 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ స్టోరేజీ ఉంటుంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా అసిస్టెన్స్ కెమెరా కూడా అమర్చారు. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో ఎల్‌ఈడీ బోర్డులను ప్రదర్శించారు. ఫైర్ యాక్సిడెంట్‌ను ముందుగానే తెలుసుకునేందుకు, నివారించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్)ను ఏర్పాటు చేశారు. ఈ బస్సులకు బ్యాటరీ చార్జీ 300 కిలోమీటర్ల దూరం పని చేస్తుంది ఫుల్ చార్జింగ్ కు రెండున్నర గంటలు పడుతుంది. ప్రయాణికుల భద్రత కు వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో, పానిక్ బటన్ అందుబాటులో ఉంది.
ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సు ప్రత్యేకతలివే!

- Advertisment -