ఎమ్మెల్యే గా కాదు మీ సేవకుడిగా వచ్చాను …..
మానకొండూర్ నియోజక వర్గానికి కొత్త ఎమ్మెల్యే రాక
పలు మండలాలలో ఘన స్వాగతం
మానకొండూర్ నియోజక వర్గం , జనత న్యూస్:
తాను ఒక ఎమ్మెల్యేగా కాకుండా, నియోజవర్గంలోని ప్రజలకు సేవకుడిల పని చేస్తానని, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లీ సత్య నారాయణ తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకి గన్నేరు వరం తిమ్మాపూర్ మానకోందూర్ కేశవ పట్నం మండలాలోనీ రోడ్ మార్గంలో అయన పర్యటించారు. మొదటిసారి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బేజ్జంకి మండలంలోని రేగులపల్లె వద్ద నుండి కేశవ పట్నం వరకు ఆది వారం ఘన స్వాగతం పలికారు. .ప్రజలకు అభివాదం చేస్తూ, తనను భారీ మెజారిటితో గెలుపొందిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.9 సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనపై, విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలకు, ఎమ్మెల్యేగా కాకుండా సేవకుడిలా పని చేస్తానని తెలిపారు. నియోజవర్గ అభివృద్ధితో పాటు పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తామన్నారు… కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటిలను 100 శాతం అమలు చేసే విధంగా చూస్తామన్నారు… నియోజకవర్గంలోని ప్రజలు పైరవి కారులను నమ్మకుండా, తననే నేరుగా వచ్చి కలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మానాల రవి, దోనే వెంకటేశ్వర రావు, చెప్యాల శ్రీనివాస్, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, మైల ప్రభాకర్, రొడ్డ మల్లేశం, మెట్ట నాగరాజు, చెలుకల నరేందర్ రెడ్డి, శనాగొండ శరత్, మానాల సాయిబాబు, సీపీఐ నాయకులు సంగేమ్ మధు, బోనగరి రూపేస్, గుడెల్లి శ్రీకాంత్
తదితరులు పాల్గొన్నారు