ఇల్లంతకుంట డిసెంబర్ 19 జనతా న్యూస్:
ఇల్లంతకుంట మండలంలోని 33 గ్రామపంచాయతీలో యాసంగి వరి నాట్లు జోరందుకున్నాయి మెట్ట ప్రాంతమైన మండలంలో మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మితమైనప్పటినుండి వరి సాగు ఎక్కువగా సాగు చేస్తున్నారు గతంలో మండలంలో పత్తి మక్కా కంది పల్లి సాగు చేసేవారు మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్మితమైనప్పటినుండి గత మూడేళ్లుగా మండలంలో భూగర్భ జలాలు పెరగడంతో వరి సాగు ఎక్కువగా చేస్తున్నారు రబి ఖరీఫ్ రెండు పంటల్లో కూడా వరి సాగు చేస్తున్నారు మండలంలోని గ్రామాల్లో బోరు బావుల్లో నీరు సమృద్ధిగా లభించడం వల్ల రైతులు వరి సాగు పట్లనే మొగ్గు చూపుతున్నారు సంవత్సర కాలంలో రెండు పంటలు వరి పండిస్తున్నారు వరి నాట్లు మండలంలో ఊపందుకున్నాయి స్థానికంగా ఉండే మహిళలతోపాటు బెంగాల్ మహారాష్ట్ర నుండి వచ్చిన కూలీలతో వరి నాట్లు భూ యజమానులు వరి నాట్లు వేయిస్తున్నారు బెంగాల్ మహారాష్ట్ర వరి నాటే కార్మికులు ఎకరాకు 5000 నుండి 6000 వరకు తీసుకుంటుండగా స్థానికంగా వరి నాట్లు వేసే మహిళలు 350 నుండి 400 వరకు తీసుకుంటున్నారని ఎటు చూసినా గంతే పడుతుందని రైతులు తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నారు వరి నాట్లు ఇప్పటి నుండి మొదలుకొని సంక్రాంతి వరకు కొనసాగుతాయని రైతులు దేవయ్య మల్లయ్య శ్రీనివాస్ రెడ్డిలు పేర్కొన్నారు నాట్లు ముగిసిన తర్వాత సంక్రాంతి పండుగకు ముందు కాటిరేవులు పశువుల కాపరులు చేస్తారని మరుసటి రోజు సంక్రాంతి పండుగ ను ఘనంగా నిర్వహించుకుంటారని రైతులు తెలిపారు వరి నాట్లు ముగించుకొని సంక్రాంతి పండుగను రైతులు ఘనంగా నిర్వహించుకుంటారని రైతులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు